అసెంబ్లీలో కేసీఆర్ ఆగ్రహం
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా.. కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ అలవాటు అయిందన్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకే సభ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ ఆరోపించారు. అన్ని పార్టీలను ఏకం చేసి, కేంద్రం మెడలు వంచి […]
ఎన్నికల్లో ప్రజలు ఓడించినా.. కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ అలవాటు అయిందన్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకే సభ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ ఆరోపించారు. అన్ని పార్టీలను ఏకం చేసి, కేంద్రం మెడలు వంచి మరీ తెలంగాణ సాధించామని ఆయన గుర్తుచేశారు. వెనుకంజ వేస్తే తెలంగాణ సాధ్యం కాదని.. పట్టుబట్టామని చెప్పారు. తెలంగాణపై మాట్లాడితేనే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్, బీజేపీ పార్టీలదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా రెండు పార్టీలు కుట్రలు సాగించాయని కేసీఆర్ విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కర్రు కాల్చి వాతలు పెడుతున్నారని కేసీఆర్ అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అసలు ఎందుకు ఓడిపోతున్నారో ఆ పార్టీలకు ఇంకా అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి.. ప్రతీ దాన్ని రాజకీయ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు చెప్పడం వారికి అలవాటుగా మారిందన్నారు. బ్యాలెట్ ఎన్నికల్లో కూడా 32 జెడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచిందని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మనం చేసిన పనికి ప్రజలు వెంటనే తీర్పు చెబుతున్నారని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏ పని చేసినా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిందని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం నిలవదని భట్టి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకోవాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలుస్తున్నారని ప్రజలను అపహాస్యం చేశారని కేసీఆర్ విమర్శించారు. డబ్బులు పెట్టి ఎవరు గెలిచారో నల్గొండ ప్రజలకు తెలుసని సీఎం కేసీఆర్ చురకలు అంటించారు. ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో నల్గొండ జిల్లాకు ఉన్న ఫ్లోరైడ్ బాధను తొలగించామని కేసీఆర్ వివరించారు. సభను తప్పుదోవ పట్టించేవరు మనకు అవసరమా అని కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు.
tag: kcr, comments, congress, bjp, assembly