ఢిల్లీ వెళ్లినా తేలని వడ్ల పంచాయితీ.. కేసీఆర్ ప్లాన్‌పై ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్ : వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానంటూ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో జరిగిన భేటీకి వెళ్లలేదు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనానికి కేసీఆర్ హాజరయ్యారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర అధికారులు మాత్రమే రాష్ట్ర పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉదయమే ప్రారంభం కానున్నందున సీఎం […]
దిశ, వెబ్‌డెస్క్ : వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానంటూ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో జరిగిన భేటీకి వెళ్లలేదు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనానికి కేసీఆర్ హాజరయ్యారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర అధికారులు మాత్రమే రాష్ట్ర పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉదయమే ప్రారంభం కానున్నందున సీఎం కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తున్నది. అపాయింట్‌మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా బుధవారం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.