ఖాసిం రజ్వీగా కేసీఆర్.. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు.. ఉన్మాద పార్టీ
దిశ, తెంగాణ బ్యూరో : జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే షోయబ్ ఉల్లాఖాన్ గుర్తుకు వచ్చారు… ఆనాడు నిజాంకు వ్యతిరేకింగా వార్తలు రాసినందుకు షోయబ్ ఉల్లాఖాన్ చేతులను ఖాసిం రజ్వీ నరికాడు… ఈవాళ కేసీఆర్ కల్వకుంట్ల ఖాసిం రజ్వీగా వ్యవహరిస్తున్నారు. ఇది మీడియాను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేడు ఒక […]
దిశ, తెంగాణ బ్యూరో : జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే షోయబ్ ఉల్లాఖాన్ గుర్తుకు వచ్చారు… ఆనాడు నిజాంకు వ్యతిరేకింగా వార్తలు రాసినందుకు షోయబ్ ఉల్లాఖాన్ చేతులను ఖాసిం రజ్వీ నరికాడు… ఈవాళ కేసీఆర్ కల్వకుంట్ల ఖాసిం రజ్వీగా వ్యవహరిస్తున్నారు. ఇది మీడియాను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేడు ఒక ఉన్మాద పార్టీకి మారిందని ఆరోపించారు. ఆ ఉన్మాద చర్యల్లో భాగంగానే జర్నలిస్ట్ రఘును అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచికత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. అరెస్ట్ ను ఖడించారు. పోలీసులు మాటు వేసి, ముసుగుతో వచ్చి, ఒక టెర్రరిస్ట్ ని అదుపులోకి తీసుకున్నట్లు జర్నలిస్ట్ రఘును కిడ్నాప్ చేయడం కేసీఆర్ నియంత పాలనుకు అద్దం పడుతోందని, ఇలాంటి చర్యకు పూనుకున్న పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.
ప్రశ్నించే గొంతుకనే తొక్కేస్తారా ? అధికారం శాశ్వతం కాదు… పెద్దపెద్ద నియంతలు మట్టిలో కలిసిపోయారని, ప్రశ్నించే గొంతుకని నొక్కేయాలని చూస్తే ప్రజలే తొక్కేస్తారని దాసోజు హెచ్చరించారు. రఘు అరెస్ట్ ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లుగా భావించాలని, భావ ప్రకటన స్వేచ్ఛని కాలరాసినట్లు అన్నారు. తెలంగాణ చైతన్య వంతమైన సమాజమని, రజాకార్లని తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డకుందన్నారు. ఒక్కసారి ప్రజలు తిరగబడితే టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ప్రాంతం వదిలివెళ్ళాల్సి ఉంటుందని హెచ్చిరించారు.
తెలంగాణలో ఆంధ్ర కక్ష రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంక ఉండవు ప్రశాంతంగా బతకొచ్చని భావించామని, కానీ కేసీఆర్ ఆధిపత్య పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ , కక్ష సాధింపు రాజకీయాలను చూస్తున్నానని విమర్శించారు. తప్పును ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసింది రఘు మీదా? లేక బండి సంజయ్ మీదా? అని ప్రశ్నించారు. దాడి చేసిన బండి సంజయ్ ని వదిలేసి రఘుని ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం జర్నలిజం అని, జర్నలిస్టు పక్షాన నిలుస్తామని వెల్లడించారు.