గ్రేటర్ స్టార్ క్యాంపెయినర్‌గా కవిత..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత ‘స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు పది మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్‌లను రంగంలోకి దించే అవకాశం ఉన్నందున ఈసారి వారిలో ఒకరిగా కవిత ఉన్నారు. ఆమె సేవలను గ్రేటర్ ఎన్నికల్లో వినియోగించుకోనున్నట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమె సోదరుడు కేటీఆర్‌కు తోడుగా ఇప్పుడు చెల్లెలు […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత ‘స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు పది మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్‌లను రంగంలోకి దించే అవకాశం ఉన్నందున ఈసారి వారిలో ఒకరిగా కవిత ఉన్నారు. ఆమె సేవలను గ్రేటర్ ఎన్నికల్లో వినియోగించుకోనున్నట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమె సోదరుడు కేటీఆర్‌కు తోడుగా ఇప్పుడు చెల్లెలు కవిత కూడా స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయనున్నారు. కీలకమైన నియోజకవర్గాల్లో ఆమె ప్రచారానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూలు ఖరారైంది.
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 2014లో ఎన్నికై ఐదేళ్ళ పాటు కేంద్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడంతో దాదాపు ఏడాదిన్నరపాటు ఖాళీగానే ఉన్నారు. పార్టీ రాజకీయాల్లో పెద్దగా తలదూర్చలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైనందున ఇక నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం నుంచే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఆమె పోషించనున్న పాత్ర భవిష్యత్తులో ఆమెకు పార్టీలో ఉండే ప్రాధాన్యతను తెలియజేస్తోంది. “నగరంలో వరదల సమయంలో ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటన చేయలేదు. బాధితులను పరామర్శించలేదు. వారి కుటుంబాల కష్టనష్టాల గురించి ఆరా తీయలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ప్రచారానికి వస్తున్నారు” అని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో గాంధీ నగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ముఠా పద్మ నరేష్‌కు మద్దతుగా ఆ ప్రాంత కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. డివిజన్‌లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని అర్థం చేయించారు. గురువారం నామినేషన్ దాఖలు చేయడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక నుంచి గ్రేటర్ పరిధిలోని చాలా స్థానాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉంది. పట్టణ ప్రజలతో, సోషల్ మీడియాను వినియోగించే యువతతో ట్విట్టర్ ద్వారా సంబంధాల్లో ఉండే కవిత ఇప్పుడు ప్రచారంలోకి నేరుగా దిగుతున్నారు. కవిత ట్విట్టర్ హాండిల్‌లో సుమారు పది లక్షల మందికంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్నా ఇప్పుడు రోడ్‌షో, ర్యాలీ, ప్రచారం తదితర రూపాల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనంతటి హోరాహోరీ పోటీ ఉన్న సమయంలో ఆమె గ్రేటర్ ఎన్నికల్లో అన్నకు తోడుగా ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. వందకంటే ఎక్కువ డివిజన్లలో గెలుపు ఖాయమని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ బతుకమ్మగా ఇప్పటివరకూ గుర్తింపు పొందిన కవిత స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దిగి మహిళల, యువత ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటిదాకా నిజామాబాద్ జిల్లా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న కవిత ఇప్పుడు గ్రేటర్‌లో ఎలాంటి ప్రభావం చూపించగలరన్నది ఆసక్తికరంగా మారింది.