కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఆమోదం.. TRSలో మొదలైన ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ఆమోదం పడింది. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఆమోదించారు. దీంతో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ హోదా వచ్చింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక హుజురాబాద్ నుంచి ఎవరికి టికెట్ వస్తుందనే ఉత్కంఠ మొదలైంది. రెడ్డి వర్గానికి ఈ పదవి రావడంతో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ఆమోదం పడింది. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఆమోదించారు. దీంతో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ హోదా వచ్చింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక హుజురాబాద్ నుంచి ఎవరికి టికెట్ వస్తుందనే ఉత్కంఠ మొదలైంది. రెడ్డి వర్గానికి ఈ పదవి రావడంతో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిణామాలు టీఆర్‌ఎస్ నేతలకు బంపర్ ఆఫర్లు తీసుకువస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గాన్ని నిధులతో నింపుతుండగా… పార్టీ నేతలకు కూడా పదవులు వస్తున్నాయి. అయితే ఈటలను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గత నెల 21న టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీలో కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించి, గవర్నర్‌కు ప్రతిపాదించారు. టీఆర్ఎస్లో చేరే సమయంలోనే కౌశిక్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆయనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా కౌశిక్‌రెడ్డికి పదవి దక్కటం టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి, తెలంగాణ భవన్ కార్యాలయ ఇంచార్జ్ శ్రీనివాస్‌రెడ్డికి ఈ పదవి ఉండగా.. ఇప్పుడు కౌశిక్‌రెడ్డికి దక్కింది.
కాగా త్వరలో ఉప ఎన్నిక జరిగే హుజురాబాద్ సెగ్మెంట్‌కు వరుసగా రెండో పదవి దక్కింది. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజురాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌ను నియమించారు. తాజాగా అదే సెగ్మెంట్‌కు చెందిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ప్రస్తుతం కేసీఆర్‌కు హుజురాబాద్ ప్రతిష్టాత్మకం కావడంతో ఇంకా ఎవరికైనా పదవి వస్తుందనే ఆశల్లో ఉన్నారు.
హుజురాబాద్ బరిలో ఎవరు
హుజురాబాద్ టికెట్ కోసం టీఆర్ఎస్లో పోటీ పెరిగింది. ఇటీవల మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ స్వర్గం రవితో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే టికెట్ కోసం ఈ వలస నేతలతో ఏండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారు కూడా అధిష్టానం దగ్గర విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం రెడ్డి వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో… ఇక బీసీ వర్గానికి టికెట్ ఇస్తారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో టికెట్ పోటీలో గెల్లు శ్రీనివాస్, స్వర్గం రవి, పొనగంటి మల్లయ్య, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌తో పాటు కనుమల్ల విజయ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.