ఉప్పొంగిన పెద్దవాగు.. కాటారం ప్రధాన రహదారి బంద్
దిశ, మహాముత్తారం : ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాటారం, మేడారం ప్రధాన రహదారి పై కేసవపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయమే మహాముత్తారం తహశీల్దార్ వినయ్ సాగర్, ఎంపీడీఓ రవీంద్రనాథ్ వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగు ఎవరూ దాటకుండా రోడ్డుపై అడ్డంగా ట్రాక్టర్ ఏర్పాటు చేసి సిబ్బందిని కాపాలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని […]
దిశ, మహాముత్తారం : ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాటారం, మేడారం ప్రధాన రహదారి పై కేసవపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయమే మహాముత్తారం తహశీల్దార్ వినయ్ సాగర్, ఎంపీడీఓ రవీంద్రనాథ్ వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగు ఎవరూ దాటకుండా రోడ్డుపై అడ్డంగా ట్రాక్టర్ ఏర్పాటు చేసి సిబ్బందిని కాపాలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని ఎవరూ కూడా సహసం చేసి దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని కోరారు.