లో దుస్తులపై జాతీయ జెండా.. వివాదంలో అమెజాన్

దిశ, వెబ్‌డెస్క్:  ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వివాదంలో చిక్కుకొంది. ఇటీవల గూగుల్ కన్నడ భాషను అవమానించిన ఘటన మరవకముందే ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ కర్ణాటక జెండాను అవమానపరిచింది. కన్నడ జాతీయ జెండా ముద్రించిన లోదుస్తులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది. లోదుస్తులపై కన్నడ రాష్ట్ర చిహ్నం, పతాకం రంగులు ముద్రించి విక్రయానికి ఉంచడంతో అమెజాన్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్నడిగులు తమ జెండాను అవమానపరిచినందుకు అమెజాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. […]

Update: 2021-06-06 02:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వివాదంలో చిక్కుకొంది. ఇటీవల గూగుల్ కన్నడ భాషను అవమానించిన ఘటన మరవకముందే ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ కర్ణాటక జెండాను అవమానపరిచింది. కన్నడ జాతీయ జెండా ముద్రించిన లోదుస్తులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది. లోదుస్తులపై కన్నడ రాష్ట్ర చిహ్నం, పతాకం రంగులు ముద్రించి విక్రయానికి ఉంచడంతో అమెజాన్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కన్నడిగులు తమ జెండాను అవమానపరిచినందుకు అమెజాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. వెంటనే అమెజాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబావాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌, అమెజాన్‌ తదితర సంస్థలు కన్నడిగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని, వెంటనే ఆ లోదుస్తుల విక్రయం ఆపి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News