మైనర్‌పై అత్యాచారం.. కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 13 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ ఘటనపై అప్పటి కరీంనగర్ త్రీ టౌన్ సీఐ సదానందం విచారణ చేసి కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 82/2017లో ఐపీసీ 376(i), 366, 506(ii), సెక్షన్ 4 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. నేరానికి పాల్పడిన […]

Update: 2021-12-03 21:18 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 13 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ ఘటనపై అప్పటి కరీంనగర్ త్రీ టౌన్ సీఐ సదానందం విచారణ చేసి కేసు నమోదు చేశారు.

క్రైం నెంబర్ 82/2017లో ఐపీసీ 376(i), 366, 506(ii), సెక్షన్ 4 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. నేరానికి పాల్పడిన నిందితుడిని కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కరీంనగర్ నాల్గొవ జిల్లా అదనపు న్యాయమూర్తి నిందితునికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 13 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

 

Tags:    

Similar News