అందుకే కేసీఆర్ మౌనం : బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని తెలిపారు. అందుకే పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని బండి ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? అని కేసీఆర్ సర్కార్‌ను ఆయన ప్రశ్నించారు. సీఎం ప్రవర్తన తీరుతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా […]
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని తెలిపారు. అందుకే పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని బండి ఆరోపించారు.
కృష్ణా జలాల పంపిణీలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? అని కేసీఆర్ సర్కార్‌ను ఆయన ప్రశ్నించారు. సీఎం ప్రవర్తన తీరుతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారనున్నాయని ఎంపీ బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
సీఎం జగన్‌తో ఒప్పందంలో భాగంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని విమర్శించారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని.. ఆగస్టు 12లోపు సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా బీజేపీ సహకరిస్తోందని.. ప్రభుత్వం కూడా అన్నివిధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ స్పష్టంచేశారు.