మళ్లీ ఆ తప్పు చేయదలుచుకోలేదు: కరీనా సైఫ్
దిశ, వెబ్‌డెస్క్ : కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మరో బిడ్డను వెల్‌కమ్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అయితే తైమూర్ విషయంలో చేసిన తప్పును మళ్లీ రిపీట్ చేయబోమని అంటున్నారు. ఫస్ట్ బేబి అనే హ్యాపీనెస్‌తో బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారో ముందే చెప్పేశారు బెబో అండ్ సైఫ్. ఆ విషయం కాస్తా కాంట్రవర్సీ అయిపోయింది. తైమూర్ అంటే భారతదేశంపై దాడి చేసిన టర్కిష్ పాలకుడని. .అలాంటి పేరు ఎలా పెడతారని రచ్చ రచ్చ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మరో బిడ్డను వెల్‌కమ్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అయితే తైమూర్ విషయంలో చేసిన తప్పును మళ్లీ రిపీట్ చేయబోమని అంటున్నారు. ఫస్ట్ బేబి అనే హ్యాపీనెస్‌తో బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారో ముందే చెప్పేశారు బెబో అండ్ సైఫ్. ఆ విషయం కాస్తా కాంట్రవర్సీ అయిపోయింది. తైమూర్ అంటే భారతదేశంపై దాడి చేసిన టర్కిష్ పాలకుడని. .అలాంటి పేరు ఎలా పెడతారని రచ్చ రచ్చ చేశారు నెటిజన్లు. దీంతో ఈసారి పుట్టబోయే బిడ్డ పేరు ముందే రివీల్ చేసేసి మరోసారి విమర్శల పాలయ్యేందుకు రెడీగా లేమని..చివర్లో చెప్పి సర్‌ప్రైజ్ చేస్తామని కరీన తెలిపింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా తయారైందంటే వ్యక్తిగత విషయాల్లోకి దూరి మరి రచ్చ చేసేంతలా. కొందరు అయితే విమర్శలే జీవితంగా బతుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే సెలెబ్రిటీలు ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా, ఏదైనా కామెంట్ చేయాలన్నా తెగ భయపడిపోతున్నారు. కరీన కూడా అంతే.. నెక్స్ట్ బేబి నేమ్ అనౌన్స్ చేసి ఎందుకు అనవసర వివాదాలకు తావివ్వడం అని డిసైడ్ అయిందన్న మాట.