కరీనా, ఆలియా.. ఎవరా సీత?
దిశ, సినిమా: భారతీయ పురాణాల ఆధారంగా భారీ సినిమాలు రూపొందించేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ‘సీత’ ప్రాజెక్ట్ ఒకటి కాగా, బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి స్ర్కిప్ట్ అందిస్తున్నారు. అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేయనున్న ప్రెస్టీజియస్ మూవీలో టైటిల్ రోల్ కోసం నిర్మాతలు కరీనా కపూర్‌ను సంప్రదించగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన బెబో.. ఇప్పటికే […]
దిశ, సినిమా: భారతీయ పురాణాల ఆధారంగా భారీ సినిమాలు రూపొందించేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ‘సీత’ ప్రాజెక్ట్ ఒకటి కాగా, బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి స్ర్కిప్ట్ అందిస్తున్నారు. అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేయనున్న ప్రెస్టీజియస్ మూవీలో టైటిల్ రోల్ కోసం నిర్మాతలు కరీనా కపూర్‌ను సంప్రదించగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన బెబో.. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం వర్కవుట్స్ కూడా మొదలుపెట్టింది.
ఈ మేరకు ‘వీర్ ది వెడ్డింగ్ 2’ మూవీతో పాటు హన్సల్ మెహతా ప్రాజెక్ట్ షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి ‘సీత’పై కాన్సంట్రేట్ చేయాలనుకుంటోంది. అయితే కరీనా అడిగిన భారీ రెమ్యునరేషన్ విషయంలోనే నిర్మాతలు సందిగ్ధంలో ఉన్నట్టు వినికిడి. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.6-8 కోట్లు చార్జ్ చేసే కరీనా.. ఈ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుండటంతో మేకర్స్ మరో ఆప్షన్ పైనా దృష్టిసారించినట్లు సమాచారం.
అయితే విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ దేశాయ్.. కరీనా వైపే మొగ్గు చూపుతుండగా, తను కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉందని టాక్. కాగా లేటెస్ట్ న్యూస్ ప్రకారం బెబో టీమ్ రెమ్యునరేషన్‌తో పాటు డేట్స్ సెట్ చేయడంలో నిమగ్నమైనట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విధివిధానాలు కొలిక్కి వస్తే, ఫార్మల్ అనౌన్స్‌మెంట్ చేయొచ్చు. ఒకవేళ కరీనాతో వర్కవుట్ కాకపోతే సెకండ్ చాయిస్‌గా ఆలియా ఉండనే ఉంది.