వారిద్దరు ఉన్నారు కదా.. పృథ్వీ షా ఎందుకు: కపిల్
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందే శుభ్‌మన్ గిల్ గాయపడినా బయటకు వెల్లడించకపోవడం.. ఇప్పుడు ఆ గాయం తీవ్రత పెరిగిపోవడంతో గిల్ స్థానంలో పృథ్వీషాను తీసుకోవాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పృథ్వీషాను ఇంగ్లాండ్ పంపాలని బీసీసీఐని అభ్యర్ధించింది. దీనిపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న క్రికెటర్లు […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందే శుభ్‌మన్ గిల్ గాయపడినా బయటకు వెల్లడించకపోవడం.. ఇప్పుడు ఆ గాయం తీవ్రత పెరిగిపోవడంతో గిల్ స్థానంలో పృథ్వీషాను తీసుకోవాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పృథ్వీషాను ఇంగ్లాండ్ పంపాలని బీసీసీఐని అభ్యర్ధించింది. దీనిపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న క్రికెటర్లు సరపోతారు. బలమైన బెంచ్ అక్కడ ఉన్నది. వారిని జట్టులోకి తీసుకొని ఆడించాలి. ఇంగ్లాండ్ పర్యటన కోసం వెళ్లిన వారిని పక్కన పెట్టి కొత్తగా వేరే వాళ్లను పంపాలని కోరడం వారిని అవమానించినట్లే అని కపిల్ అన్నారు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ గతంలో ఓపెనర్లుగా రాణించిన క్రికెటర్లే. గిల్ లేకపోతే వారిద్దిలో ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. ఇంగ్లాండ్ లోనే ఆటగాళ్లు అందుబాటులో ఉంటే.. వేరే దేశంలో పర్యటిస్తున్న పృథ్వీషాను ఎందుకు కోరుతున్నారో అర్దం కావడం లేదని కపిల్ అన్నారు. సెలెక్టర్లు కూడా ఈ విషయం ఆలోచించాలి.. అక్కడ ఉన్నది వాళ్లు పంపిన జట్టే.. ఇప్పుడు కొత్తగా పంపితే వారికి కూడా అవమానమే కదా అని కపిల్ ప్రశ్నించారు.