గుండె పోటుతో.. యంగ్ హీరో మృతి

ప్రముఖ కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా (39) ఈరోజు (ఆదివారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య తలెత్తడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స జరుగుతుండగానే ఆయన చనిపోయారు. కాగా, గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు కన్‌ఫర్మ్ చేశారు. చిరంజీవి సర్జా మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2009లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి సర్జా.. అనేక […]

Update: 2020-06-07 07:37 GMT

ప్రముఖ కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా (39) ఈరోజు (ఆదివారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య తలెత్తడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స జరుగుతుండగానే ఆయన చనిపోయారు. కాగా, గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు కన్‌ఫర్మ్ చేశారు. చిరంజీవి సర్జా మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2009లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి సర్జా.. అనేక సినిమాల్లో హీరోగా మెప్పించి, యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో ఆకే, సింగా, సంహారా, ఖాకీ, శివార్జున, ఆద్యా వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రిల్, రణం వంటి సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. చిరంజీవికి నటి మేఘనా రాజ్‌తో 2018లో వివాహం జరిగింది.

Tags:    

Similar News