అవార్డ్ ఫంక్షన్లో టాప్ ప్రొడ్యూసర్‌ను అవమానించిన తలైవి
దిశ, సినిమా : కంగనా రనౌత్, కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ కాంట్రవర్సీ గురించి తెలియంది కాదు. గతంలో ఈ షోకు గెస్ట్‌గా వచ్చిన కంగన.. ‘బంధుప్రీతికి బ్రాండ్ అంబాసిడర్, మూవీ మాఫియా’ అంటూ కరణ్‌ను డైరెక్ట్‌గా విమర్శించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోగా, 2007 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తను కరణ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియోను రీసెంట్గా షేర్ చేసింది. ఆ టైమ్‌లో తనకు బాలీవుడ్ కొత్తే అయినప్పటికీ, అదే ఆటిట్యూడ్ ఉండేదని […]
దిశ, సినిమా : కంగనా రనౌత్, కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ కాంట్రవర్సీ గురించి తెలియంది కాదు. గతంలో ఈ షోకు గెస్ట్‌గా వచ్చిన కంగన.. ‘బంధుప్రీతికి బ్రాండ్ అంబాసిడర్, మూవీ మాఫియా’ అంటూ కరణ్‌ను డైరెక్ట్‌గా విమర్శించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోగా, 2007 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తను కరణ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియోను రీసెంట్గా షేర్ చేసింది. ఆ టైమ్‌లో తనకు బాలీవుడ్ కొత్తే అయినప్పటికీ, అదే ఆటిట్యూడ్ ఉండేదని చెప్పింది. వీడియో విషయానికొస్తే.. కరణ్ హోస్ట్ చేస్తున్న అవార్డ్స్ సెర్మనీలో తర్వాతి అవార్డ్ అనౌన్స్ చేస్తూ ‘ఇది పబ్లిక్ పోల్ ద్వారా నిర్ణయించబడిన అవార్డ్, మూడేళ్లుగా నేనే గెలుచుకుంటున్నాను’ అని ప్రకటించాడు. అయితే స్క్రీన్ మీద కంగన పేరు డిస్ప్లే కావడంతో.. ఆమె స్టేజి పైకి వచ్చి అవార్డు తీసుకుంది. ఈ క్రమంలోనే నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోతుండగా, తన అటెన్షన్ క్యాచ్ చేసేందుకు ప్రయత్నించిన కరణ్.. ‘కంగన, ఐయామ్ హియర్’ అంటున్నా ఆమె పట్టించుకోలేదు. దీంతో ‘థాంక్యూ కంగన, కంగ్రాట్యులేషన్స్’ అంటూ కవర్ చేసుకున్నాడు.
కాగా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన కంగన.. ‘నా ఆటిట్యూడ్ మొదటి నుంచి తేడానే. బాలీవుడ్లో అదే నాకు ఫస్ట్ ఇయర్. నేను అప్పటికి ఇంకా టీనేజర్నే అయినా, నా వైఖరి మాత్రం అలాగే ఉండేది’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది.