మణికర్ణిక మాయ.. డైరెక్టర్‌గా కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాలో కొంత పార్ట్‌కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్‌తో విభేదాల కారణంగా ఆ టైమ్‌లో తను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకురాలిగా మారబోతోంది కంగనా. ‘అపరాజిత అయోధ్య’ చిత్రానికి మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. రామమందిరం ఇష్యూ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించారట. కథ నచ్చడంతో కంగనా […]

Update: 2020-06-08 01:33 GMT

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాలో కొంత పార్ట్‌కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్‌తో విభేదాల కారణంగా ఆ టైమ్‌లో తను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకురాలిగా మారబోతోంది కంగనా. ‘అపరాజిత అయోధ్య’ చిత్రానికి మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. రామమందిరం ఇష్యూ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించారట. కథ నచ్చడంతో కంగనా తనే నిర్మాతగా ఉండాలనుకుందట. కానీ ఈ సినిమాకు అసోసియేట్ అయినవారంతా తనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని.. సినిమాకు కూడా ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డారట. దీంతో కంగనా కూడా డైరెక్షన్‌ వైపు మొగ్గుచూపిందట.

మణికర్ణిక ద్వారా దర్శకురాలిగా కలిగిన అనుభవం.. అపరాజిత అయోధ్యకు ఉపయోగపడుతుందని అంటున్న కంగనా.. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ బిజినెస్ చేయగా.. సినిమా మాత్రం ముందుగా థియేటర్లలోనే రిలీజ్ కానుందట. దీంతో పాటు థాకడ్, తేజస్ చిత్రాలు కూడా చేస్తున్నారు కంగనా.

Tags:    

Similar News