లతాజీ ఓ ‘కర్మయోగి’ : కంగనా
దిశ, వెబ్‌డెస్క్: మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 91వ పుట్టినరోజు సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌తో కలిపి దాదాపు 36 భాషల్లో పాటలు పాడి.. ‘వాయిస్ ఆఫ్ నేషన్, వాయిస్ ఆఫ్ మిలీనియం’గా కీర్తించబడిన తను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే చిన్ననాటి పిక్ షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలపగా.. […]
దిశ, వెబ్‌డెస్క్: మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 91వ పుట్టినరోజు సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌తో కలిపి దాదాపు 36 భాషల్లో పాటలు పాడి.. ‘వాయిస్ ఆఫ్ నేషన్, వాయిస్ ఆఫ్ మిలీనియం’గా కీర్తించబడిన తను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే చిన్ననాటి పిక్ షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలపగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హార్ట్ ఫుల్ విషెస్ అందించారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను కర్మయోగి అంటూ కీర్తించిన కంగనా.. కొందరు సంపూర్ణ దృష్టితో ఒకే పని చేస్తూ, అందులో రాణించగలగడమే కాదు.. ఆ పనికి పర్యాయపదంగా మారుతారు. అటువంటి అద్భుతమైన కర్మయోగి లతా మంగేష్కర్ అంటూ కొనియాడింది.
అమృతత్వంతో కూడిన తన వాయిస్‌తో లతాజీ సింగర్‌గా ప్రశంసలు అందుకుని.. మ్యూజిక్ డైరెక్టర్‌గా, నిర్మాతగానూ రాణించారు. ఆమె భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గాను ‘భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్’ లాంటి భారత అత్యున్నత పురస్కారాలతో సత్కరించబడ్డారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన లతాజీ.. ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు.
https://twitter.com/KanganaTeam/status/1310443488853372928