‘ఇండియా’ పేరును మార్చాలని కంగన డిమాండ్

దిశ, సినిమా : బ్రిటిష్ వారు పెట్టిన బానిస పేరు ‘ఇండియా’ను ‘భారత్‌’గా మార్చాలని డిమాండ్ చేసింది కంగనా రనౌత్. ఇండస్ రివర్ బేస్ చేసుకుని మనదేశానికి ఆ పేరు పెట్టారన్న కంగన.. ఒక బిడ్డ పుడితే చిన్నముక్కు, సెకండ్ బార్న్, వార్స్ సి అని పిలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో.. భారత్‌ను ఇండియా అని పిలిస్తే అలాగే ఉంటుందని భారత్‌ అర్థాన్ని వివరించింది. మనదేశం ప్రాచీన ఆధ్యాత్మికతను ఆచరిస్తూ, వివేకంతో వ్యవహరిస్తేనే ఎదగగలదని.. అదే మన […]

Update: 2021-06-22 03:21 GMT

దిశ, సినిమా : బ్రిటిష్ వారు పెట్టిన బానిస పేరు ‘ఇండియా’ను ‘భారత్‌’గా మార్చాలని డిమాండ్ చేసింది కంగనా రనౌత్. ఇండస్ రివర్ బేస్ చేసుకుని మనదేశానికి ఆ పేరు పెట్టారన్న కంగన.. ఒక బిడ్డ పుడితే చిన్నముక్కు, సెకండ్ బార్న్, వార్స్ సి అని పిలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో.. భారత్‌ను ఇండియా అని పిలిస్తే అలాగే ఉంటుందని భారత్‌ అర్థాన్ని వివరించింది. మనదేశం ప్రాచీన ఆధ్యాత్మికతను ఆచరిస్తూ, వివేకంతో వ్యవహరిస్తేనే ఎదగగలదని.. అదే మన నాగరికత గొప్పతనమని అభిప్రాయపడింది. భారత్ పట్టణాభివృద్ధి సాధిస్తేనే.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంది. అంతేకానీ వెస్ట్రన్ వరల్డ్ చీప్ కాపీగా కాకుండా.. వేదాలు, గీతాసారం, యోగను విలువైన ఆస్తిగా మలచుకుంటూ.. భారత్ అగ్రగామిగా ఎదగవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా పూర్వకాలంలో పూజలు చేస్తున్న మహిళల ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma