తుక్డే తుక్డే గ్యాంగ్‌లకు నేను భయపడను.. బాలీవుడ్ నటి
దిశ, సినిమా : భారత రైతులను ఖలిస్థానీలుగా పేర్కొన్న నటి కంగనా రనౌత్‌పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు తన వ్యాఖ్యలను తప్పుబట్టిన కొంతమంది, దేశ ద్రోహిగా సంబోధిస్తూ చంపేస్తామని బెదిరించారని కంగనా చెప్పింది. అయితే వారందరిపై కేసు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఈ మేరకు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ఎదుట నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తున్న పిక్స్ షేర్ చేసిన నటి.. డబ్బు, అధికారం కోసం భరత మాతను కించపరిచే దేశద్రోహులను ఎప్పటికీ […]
దిశ, సినిమా : భారత రైతులను ఖలిస్థానీలుగా పేర్కొన్న నటి కంగనా రనౌత్‌పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు తన వ్యాఖ్యలను తప్పుబట్టిన కొంతమంది, దేశ ద్రోహిగా సంబోధిస్తూ చంపేస్తామని బెదిరించారని కంగనా చెప్పింది. అయితే వారందరిపై కేసు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఈ మేరకు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ఎదుట నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తున్న పిక్స్ షేర్ చేసిన నటి.. డబ్బు, అధికారం కోసం భరత మాతను కించపరిచే దేశద్రోహులను ఎప్పటికీ క్షమించకూడదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదన్న కంగనా.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్స్ పంజాబ్‌లోని పవిత్ర భూమిని ఖలిస్థాన్‌గా మార్చాలని కలలు కంటున్నాయని తెలిపింది.
పౌరుల సమగ్రత, ఐక్యత, ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిందని.. ఏ కులం, మతం లేదా సమూహాన్ని ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని వివరించింది. అలాగే సోనియా గాంధీని ప్రస్తావిస్తూ.. ‘మీరు కూడా ఒక మహిళ, మీ అత్తగారు ఇందిరా గాంధీ చివరి క్షణం వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇలాంటి శక్తుల నుంచి వచ్చే బెదిరింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దయచేసి పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించండి’ అంటూ తెలిపింది. చివరగా రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ముగించింది.