జరిగిన అన్యాయం చెప్పాను: కంగనా

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కంగనా రనౌత్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముంబై‌లో అడుగుపెట్టొద్దని శివసేన నేతలు, కార్యకర్తలు బహిరంగ హెచ్చరికలు చేసినా.. కంగనా చెప్పిన ప్రకారం ముంబైలో‌ అడుగుపెట్టింది. ఆ తర్వాత తన భవనాన్ని అక్రమ కట్టడం అంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించడం.. కోర్టు స్టే ఇవ్వడంలాంటి పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం కంగనా రనౌత్ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారితో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం […]

Update: 2020-09-13 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కంగనా రనౌత్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముంబై‌లో అడుగుపెట్టొద్దని శివసేన నేతలు, కార్యకర్తలు బహిరంగ హెచ్చరికలు చేసినా.. కంగనా చెప్పిన ప్రకారం ముంబైలో‌ అడుగుపెట్టింది. ఆ తర్వాత తన భవనాన్ని అక్రమ కట్టడం అంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించడం.. కోర్టు స్టే ఇవ్వడంలాంటి పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం కంగనా రనౌత్ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారితో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అనంతరం కంగనా రనౌత్ ఏఎన్ఐ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తనకు జరిగిన అన్యాయం పై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారికి వివరించినట్టు చెప్పారు. గవర్నర్ తన మాటలను సొంత కూతురిలా భావించి వినడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

Tags:    

Similar News