చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు
దిశ: కమలాపూర్: ఫోటో కెమెరాని దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉపాధి కోల్పోయిన బాధితునికి తిరిగి కెమెరాని అప్పగించి, పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిలువేరు కిషన్ ఫోటోగ్రాఫర్ గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన తన పనిలో భాగంగా మల్లక్కపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు ఫోటో, వీడియోలు తీసుకుని ఇంటికి బయల్దేరాడు. తన ద్విచక్రవాహనంపై సోదరి […]
దిశ: కమలాపూర్: ఫోటో కెమెరాని దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉపాధి కోల్పోయిన బాధితునికి తిరిగి కెమెరాని అప్పగించి, పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిలువేరు కిషన్ ఫోటోగ్రాఫర్ గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన తన పనిలో భాగంగా మల్లక్కపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు ఫోటో, వీడియోలు తీసుకుని ఇంటికి బయల్దేరాడు.
తన ద్విచక్రవాహనంపై సోదరి లలితతో కలిసి వస్తుండగా గూనిపర్తి గ్రామం దాటిన తర్వాత కాలకృత్యాల నిమిత్తం ద్విచక్ర వాహనం రోడ్డు పక్కకు పార్క్ చేశారు. అదే సమయంలో బైక్‌పై ఉన్న కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు కెనటిక్ బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లారు . దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కుటుంబ జీవనాధారమైన కెమెరా దొంగలించపడడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో కేసును సవాల్‌గా తీసుకుని 24 గంటల్లో నిందితులను గుర్తించారు. కెమెరాలను స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగించారు. ఏసీపీ. పీ. శ్రీనివాస్, సీఐ .పి. కిషన్, ఎస్సై సురేష్ మరియు పోలీస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా కేసును చేధించటంతో బాధితుడు హర్షం వ్యక్తం చేశారు.