మొక్కలకు నామకరణం చేసిన ‘హలో’ భామ
ప్రకృతిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చైన్ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు ఉత్సాహంగా ఈ చాలెంజ్ స్వీకరిస్తుండగా.. అభిమానులు సైతం వారిని ఫాలో అవుతున్నారు. ఈ మధ్య బ్యూటీఫుల్ రష్మిక మందన్నాను గార్జియస్ హీరోయిన్ సమంత అక్కినేని.. ఈ చాలెంజ్‌కు నామినేట్ చేయగా, యాక్సెప్ట్ చేసిన రష్మిక మూడు మొక్కలను నాటింది. ఆ తర్వాత హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్, రాశీ ఖన్నా, అశిక రంగనాథ్‌ను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది. కాగా […]
ప్రకృతిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చైన్ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు ఉత్సాహంగా ఈ చాలెంజ్ స్వీకరిస్తుండగా.. అభిమానులు సైతం వారిని ఫాలో అవుతున్నారు. ఈ మధ్య బ్యూటీఫుల్ రష్మిక మందన్నాను గార్జియస్ హీరోయిన్ సమంత అక్కినేని.. ఈ చాలెంజ్‌కు నామినేట్ చేయగా, యాక్సెప్ట్ చేసిన రష్మిక మూడు మొక్కలను నాటింది. ఆ తర్వాత హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్, రాశీ ఖన్నా, అశిక రంగనాథ్‌ను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది.
కాగా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.. చిన్న మొక్కలను కూడా కౌంట్‌లోకి తీసుకోవాలని కోరింది. తనకు గార్డెనింగ్ గురించి అంతగా అవగాహన లేదని.. తన స్మార్ట్ గార్డెన్‌లో మూడు చిన్ని చిన్ని మొక్కలను నాటినట్లు తెలిపింది. అన్నియాన్, అంబి, రెమోగా వాటికి నామకరణం కూడా చేసిన కళ్యాణి.. అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు రాజా రాణి ఫేమ్ నజ్రియా ఫహాద్‌లను నామినేట్ చేసింది.