కాళేశ్వరం కేసు ఎన్జీటీ ఢిల్లీ బెంచికి బదిలీ
దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అనుమతులు లేవంటూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీలోని ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ-చెన్నై) ప్రకటించింది. తుమ్మనపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి తీర్పును గురువారం వెల్లడించారు. రెండో టీఎంసీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు ఇప్పటికే ఢిల్లీ బెంచిలో వాదనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లు […]
దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అనుమతులు లేవంటూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీలోని ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ-చెన్నై) ప్రకటించింది. తుమ్మనపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి తీర్పును గురువారం వెల్లడించారు.
రెండో టీఎంసీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు ఇప్పటికే ఢిల్లీ బెంచిలో వాదనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లు స్వీకరించడం కరెక్ట్ కాదని ఇప్పటికే చెన్నై బెంచ్ ప్రకటించింది. దీన్ని ఢిల్లీ బెంచ్‌కు బదిలీ చేసే అంశాలను పరిగణిస్తామని గతంలో జరిగిన వాదనల సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం కేసు విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ హాజరై వాదనలు వినిపించారు. కానీ ఇప్పటికే కేసు ఢిల్లీ బెంచిలో ఉండటంతో ఈ పిటిషన్‌ను కూడా ఢిల్లీకి బదిలీ చేస్తున్నట్లు చెన్నై ఎన్జీటీ వెల్లడించింది.