ఎంగేజ్మెంట్ చేసుకున్న కాజల్?
స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. కొత్త తారలు ఎంత మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టినా సరే.. తన ప్రత్యేకత తనదే. ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శర్వానంద్ లాంటి యంగ్ స్టార్స్‌తో రొమాన్స్ చేస్తూనే, అటు సీనియర్ యాక్టర్స్ కమల్ హాసన్, చిరంజీవితోనూ ఆడిపాడి మెప్పించగలిగింది. కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశాలు వెల్లువెత్తగా.. తనకంటే ముందు చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకున్నా, తను మాత్రం కెరియర్‌పైనే దృష్టి […]
స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. కొత్త తారలు ఎంత మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టినా సరే.. తన ప్రత్యేకత తనదే. ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శర్వానంద్ లాంటి యంగ్ స్టార్స్‌తో రొమాన్స్ చేస్తూనే, అటు సీనియర్ యాక్టర్స్ కమల్ హాసన్, చిరంజీవితోనూ ఆడిపాడి మెప్పించగలిగింది.
కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశాలు వెల్లువెత్తగా.. తనకంటే ముందు చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకున్నా, తను మాత్రం కెరియర్‌పైనే దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికే 35 ఏళ్లు రావడంతో కాజల్ పెళ్లి వైపు అడుగులు వేసిందని కోలీవుడ్ టాక్. ఇన్నాళ్లు పెళ్లి అంటే చూద్దాంలే.. అన్నట్లు సమాధానమిచ్చిన కాజల్.. ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుందని సమాచారం. బిజినెస్‌మన్ గౌతమ్‌తో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అందాల రాధమ్మ నిజంగానే జోగేంద్రను ఎన్నుకుందా లేదా అనేది ఆమె స్పందిస్తే కానీ తెలియదు.