ఎన్నో ఇబ్బందుల మధ్య పెరిగా : కాజల్
దిశ, సినిమా: బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గురించి వివరించింది. ఐదేళ్ల వయస్సులోనే తనకు ఆస్తమా ఉందని తెలిసిందని.. దీంతో ఆహార నియంత్రణ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అంత చిన్నపిల్లలు చాక్లెట్లు, డైరీస్‌కు దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చన్న కాజల్.. ఎన్ని ఇబ్బందుల మధ్య పెరిగానో అర్థం చేసుకోవాలని చెప్పింది. ప్రతీ శీతాకాలం, డస్ట్, స్మోక్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని.. ఉపశమనం పొందేందుకు ఇన్‌హేలర్స్ […]
దిశ, సినిమా: బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గురించి వివరించింది. ఐదేళ్ల వయస్సులోనే తనకు ఆస్తమా ఉందని తెలిసిందని.. దీంతో ఆహార నియంత్రణ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అంత చిన్నపిల్లలు చాక్లెట్లు, డైరీస్‌కు దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చన్న కాజల్.. ఎన్ని ఇబ్బందుల మధ్య పెరిగానో అర్థం చేసుకోవాలని చెప్పింది. ప్రతీ శీతాకాలం, డస్ట్, స్మోక్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని.. ఉపశమనం పొందేందుకు ఇన్‌హేలర్స్ ఉపయోగించడం ద్వారా బెస్ట్ రిజల్ట్ చూశానని తెలిపింది. సో అప్పటి నుంచి ప్రతీసారి కూడా ఇన్‌హేలర్స్ క్యారీ చేస్తున్నానని.. కానీ అలాంటప్పుడు కొంచెం ఆడ్ క్వశ్చన్స్ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని చెప్పింది.
కానీ వాటి గురించి తనకేమీ బాధ లేదన్న కాజల్.. మనదేశంలో లక్షల మందికి ఇన్‌హేలర్స్ వినియోగించాల్సిన అవసరం ఉందని, కానీ ఎవరో ఏదో అనుకుంటారని వీటికి దూరంగా ఉండి ఇబ్బంది పడుతూనే ఉన్నారంది. ఇన్‌హేలర్‌ను యూజ్ చేసేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికైనా ఇండియా రియలైజ్ కావాలని, #SayYesToInhalers కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చింది.