కడపలో లాక్‌డౌన్ షురూ

దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి కడప‌ జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఈ ఉదయం నుంచి కడపలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్‌, హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటించారు. అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన […]

Update: 2020-07-26 22:01 GMT
కడపలో లాక్‌డౌన్ షురూ
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి కడప‌ జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఈ ఉదయం నుంచి కడపలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్‌, హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటించారు.

అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను 11 గంటల లోపే కొనుగోలు చేయాలని సూచించారు. బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపారు. లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News