సర్కార్‌కు షాక్.. ఎంజీఎంలో జూడాల సమ్మె..
దిశ ప్రతినిధి, వరంగల్ : తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త జూనియర్ డాక్టర్ల సంఘం సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం వరంగల్ ఎంజీఎం జూడాలు విధులను బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవల విధులను బహిష్కరించినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు కొవిడ్ రోగులకు అందజేస్తున్న […]
దిశ ప్రతినిధి, వరంగల్ : తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త జూనియర్ డాక్టర్ల సంఘం సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం వరంగల్ ఎంజీఎం జూడాలు విధులను బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవల విధులను బహిష్కరించినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు కొవిడ్ రోగులకు అందజేస్తున్న చికిత్సలో జూనియర్ డాక్టర్ల సేవలే కీలకంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూడాల సమ్మె ఎఫెక్ట్ వైద్య సేవలపై పడుతుందని వైద్యా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.