నాకు ఆ కుర్చీయే కావాలంటున్న జూనియర్ అసిస్టెంట్..!

దిశ, వేములవాడ : రాజన్న దర్శనానికి వచ్చే సామాన్య భక్తులతో పాటు వీఐపీలు స్వామి వారి దర్శనం చేసుకునేలా సేవలు అందించాల్సిన ఓ అధికారి కేవలం వీఐపీల సేవలో తరిస్తూ, ఆ సీటుకే అతుక్కుపోయారు. రాష్ట్రంలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఓ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఈ శాఖలో ఆఫీసర్ ఉన్నప్పటికీ, ఆయనను పక్కకు పెట్టి, పెత్తనమంతా ఈ సారే చలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. […]

Update: 2021-03-06 20:33 GMT
నాకు ఆ కుర్చీయే కావాలంటున్న జూనియర్ అసిస్టెంట్..!
  • whatsapp icon

దిశ, వేములవాడ : రాజన్న దర్శనానికి వచ్చే సామాన్య భక్తులతో పాటు వీఐపీలు స్వామి వారి దర్శనం చేసుకునేలా సేవలు అందించాల్సిన ఓ అధికారి కేవలం వీఐపీల సేవలో తరిస్తూ, ఆ సీటుకే అతుక్కుపోయారు. రాష్ట్రంలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఓ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఈ శాఖలో ఆఫీసర్ ఉన్నప్పటికీ, ఆయనను పక్కకు పెట్టి, పెత్తనమంతా ఈ సారే చలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నేండ్లుగా ఈ శాఖలో పని చేస్తూ, మిగితా శాఖలకు బదిలీ చేసినప్పటికీ పైరవీలు చేసి ఆ సీటునే ఎంచుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. సదరు ఉద్యోగి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు, వీఐపీలకు స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజల వివరాలు తెలియజేయాల్సి ఉండగా, కేవలం వీఐపీ, ప్రజా ప్రతినిధుల సేవలో తరిస్తున్నాడు.

డిప్యుటేషన్‌పై పంపినా..

బదిలీపై వెళ్లిన ఈవో ఏండ్లుగా ఆ సీటులోనే ఉన్న సదరు ఉద్యోగిని డిప్యూటేషన్‌పై కరీంనగర్‌కు పంపించారు. ఆ శాఖలో పని చేస్తున్న సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసి, ఆ శాఖను లేకుండా చేశారు. ఈ మధ్య కాలంలో ఈవో బదిలీపై వెళ్లగా కొత్త ఈవో రావడంతో గతంలో ఉన్న పలుకు బడితో తిరిగి ఆ శాఖలో విధులు నిర్వహించేలా చేసుకున్నాడు. మళ్లీ పూర్వ వైభవంలా పెత్తనం వెలగబెడుతున్నాడు. ఇదే శాఖలో పైఆఫీసర్ ఉన్నప్పటికీ, ఈ సారుదే పెత్తనం. ఇదంతా ఆలయ ఈవో కళ్ల ఎదుటే జరిగినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నారు.

Tags:    

Similar News