ఎట్టకేలకు పట్టాలెక్కిన అమీర్ కొడుకు ఫస్ట్ ఫిల్మ్
దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఫస్ట్ ఫిల్మ్ ‘మహారాజ’ చిత్రీకరణ ప్రారంభమైంది. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న జునైద్.. ఫస్ట్ టైమ్ కెమెరాను ఫేస్ చేయబోతుండగా, సిస్టర్ ఐరా ఖాన్ స్పెషల్ విషెస్ చెప్పింది. సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘1862 మహరాజ్ లైబెల్’ కేసు ఆధారంగా తెరకెక్కుతుండగా.. జర్నలిస్ట్ కర్సన్ దాస్ ముల్జీ పాత్రలో కనిపించనున్నాడు జునైద్. View this post on Instagram […]
దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఫస్ట్ ఫిల్మ్ ‘మహారాజ’ చిత్రీకరణ ప్రారంభమైంది. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న జునైద్.. ఫస్ట్ టైమ్ కెమెరాను ఫేస్ చేయబోతుండగా, సిస్టర్ ఐరా ఖాన్ స్పెషల్ విషెస్ చెప్పింది. సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘1862 మహరాజ్ లైబెల్’ కేసు ఆధారంగా తెరకెక్కుతుండగా.. జర్నలిస్ట్ కర్సన్ దాస్ ముల్జీ పాత్రలో కనిపించనున్నాడు జునైద్.
ఈ సందర్భంగా తనకు బెస్ట్ విషెస్ అందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ ఫెల్ట్ నోట్ పెట్టింది ఐరా. మోకాళ్ల మీద కూర్చుని బ్రదర్‌కు ఫ్లవర్ బొకే అందిస్తున్న పిక్ షేర్ చేసిన ఐరా.. జున్నుకు ఇది ఫస్ట్ ప్లే కాకపోయినా ఫస్ట్ డే షూట్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపింది. ‘తన వృత్తినైపుణ్యం అసమానమైంది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను బ్లో చేసే వరకు వెయిట్ చేయలేకపోతున్నా’ అని చెప్పింది. ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు బయటకు షేర్ చేయకుండా చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నాడని.. ఇది కాస్త తనను ఇరిటేట్ చేస్తుందని చెప్పింది. కాగా ఇప్పుడు తను నటించే సెట్‌కు వెళ్లొచ్చు, తనను ఇబ్బంది పెట్టొచ్చని హ్యపీగా ఫీలవుతున్న ఐరా.. జునైద్ చెల్లిగా తనకు ఇది ప్రౌడ్ మోమెంట్ అని తెలిపింది. కాగా ముంబై మరోల్‌లోని విజయ్ నగర్లో వేసిన మాసివ్ సెట్లో షూటింగ్ జరుగుతుండగా.. అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది.