నిర్బంధంలోనే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయిన అసాంజే

న్యూఢిల్లీ: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గత 10 ఏండ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నాడు. వికీలీక్స్ పేరుతో అమెరికా సహా అనేక దేశాల రహస్య పత్రాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. దీంతో ఆయనపై అమెరికా ఆనేక కేసులు నమోదు చేసి అరెస్టుకు ఆదేశించింది. దీంతో అతడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో స్వీయనిర్బంధంలోనికి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి అక్కడ ఉండి న్యాయ పోరాటం చేస్తున్నాడు. బయటకు వస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తన […]

Update: 2020-04-12 04:33 GMT

న్యూఢిల్లీ: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గత 10 ఏండ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నాడు. వికీలీక్స్ పేరుతో అమెరికా సహా అనేక దేశాల రహస్య పత్రాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. దీంతో ఆయనపై అమెరికా ఆనేక కేసులు నమోదు చేసి అరెస్టుకు ఆదేశించింది. దీంతో అతడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో స్వీయనిర్బంధంలోనికి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి అక్కడ ఉండి న్యాయ పోరాటం చేస్తున్నాడు. బయటకు వస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తన లాయర్ ద్వారా కోర్టుల్లో పోరాడుతున్నాడు. తాజాగా ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రైన విషయం బయటకు వచ్చింది. తన న్యాయవాదుల్లో ఒకరైన స్టెల్లా మారిస్ ద్వారా ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడంటా. వారిలో ఒకరికి ఏడాది వయసుండగా.. మరొక అబ్బాయికి రెండేండ్ల వయసు ఉంది. కాగా, దక్షిణాఫ్రికాలో పుట్టిన స్టెల్లాతో అసాంజేకు ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే పరిచయం. అది కాస్తా ప్రేమకు దారితీయడంతో 2017లో అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఈ విషయం రహస్యంగానే ఉండిపోయినా.. గత నెలలో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అసాంజే ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు మెయిల్ పత్రిక పూర్తి వివరాలను బయటపెట్టింది. కాగా, ఏడాదిగా జూలియన్ అసాంజే లండన్‌లోని బెల్‌మార్ష్ జైలులో ఉంటున్నాడు. ఈక్వెడార్ తమ దౌత్య రక్షణను ఏడాది క్రితం ఉపసంహరించడంతో ఆయన బ్రిటన్‌కు లొంగిపోయారు. కాగా, జైలులో ఉన్న అసాంజే తనకు కరోనా నుంచి ముప్పు ఉందని.. బెయిల్ ఇవ్వాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. తాను ఇద్దరు బిడ్డలకు తండ్రినని వారి ఆలనా పాలనా చూడాలని ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు. అప్పుడే ఈ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కాగా, అసాంజే బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది.

Tags: Julian assange, detention, shelter, wikileaks, bail petition, father

Tags:    

Similar News