అఖిల ప్రియకు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిల ప్రియ మూడు రోజుల కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మూడు రోజుల విచారణకు సంబంధించిన నివేదికను కూడా సమర్పించారు. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి అఖిల ప్రియకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ పరిణామాల దృష్ట్యా ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, […]
దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిల ప్రియ మూడు రోజుల కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మూడు రోజుల విచారణకు సంబంధించిన నివేదికను కూడా సమర్పించారు. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి అఖిల ప్రియకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ పరిణామాల దృష్ట్యా ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, బెయిల్ ఇవ్వాలని అఖిల ప్రియ తరఫు న్యాయవాది వాదించడంతో.. బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు శనివారం విచారిస్తామని స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో అఖిల ప్రియ ప్రధానంగా హఫీజ్‌పేట భూముల గురించే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ భూముల్లో 40 శాతం వాటా తమ కుటుంబానికి ఉందని చెప్పినట్టు సమాచారం. అయితే, తన భర్త భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్‌ల ఆచూకీ తెలియదని అఖిల ప్రియ విచారణలో తెలిపారు.