బిర్యానీ మార్కెట్లోకి డోమినోస్!
దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో స్పైసీ ఫుడ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా దక్షిణ భారతంలో రకరకాల రుచులను ఇష్టపడే వారు ఎక్కువమందే ఉంటారు. వీటిలో బిర్యానిది ప్రత్యేక స్థానం. ఫుడ్ ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ కలిగి ఉంది. ఈ క్రమంలో దేశీయంగా బిర్యానీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ డోమినోస్ పిజ్జా సరికొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ‘ఏకదమ్’ పేరుతో బిర్యానీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు […]
దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో స్పైసీ ఫుడ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా దక్షిణ భారతంలో రకరకాల రుచులను ఇష్టపడే వారు ఎక్కువమందే ఉంటారు. వీటిలో బిర్యానిది ప్రత్యేక స్థానం. ఫుడ్ ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ కలిగి ఉంది. ఈ క్రమంలో దేశీయంగా బిర్యానీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ డోమినోస్ పిజ్జా సరికొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ‘ఏకదమ్’ పేరుతో బిర్యానీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా భిన్న రుచులతో బిర్యానీలను అందుబాటులోకి తీసుకొస్తామని, సుమారు 20 రకాల బిర్యానీలను కస్టమర్లకు అందించనున్నామని కంపెనీ తెలిపింది.
ఈ బిర్యానీ ధరలు రూ. 99 నుంచి మొదలవుతాయని, ప్రస్తుతానికి గుర్గావ్ రెస్టారెంట్‌లో వీటిని ప్రారంభించామని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు వెల్లడించింది. యాప్, వైబ్‌సైట్ల నుంచి కూడా ఆర్డర్ చేసుకునే వీలుంటుందని జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ పేర్కొంది. కస్టమర్లు కోరుకునే హైదరాబాద్ నిజామీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, లఖ్‌నవి బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ సహా 20 రకాల వరకు లభిస్తాయని, నాన్-వెజ్, వెజ్ బిర్యానీలను వేర్వేరుగా తయారు చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.