రాష్ట్రాల మధ్య విభజన తెచ్చిన భారత్ బంద్ : రాజ్‌దీప్

దిశ, వెబ్‌డెస్క్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ సందర్భంగా రాష్ట్రాల మధ్య విభజన ఏర్పడిందని ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. బంద్ నేపథ్యంలో అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందన్నారు. భారత్ బంద్ సమయంలో దుకాణా సముదాయాలు మూసివేయరాదని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసులు బెదిరిస్తున్నారని, నాన్ బీజేపీ రూలింగ్ రాష్ట్రాల్లో […]

Update: 2020-12-08 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ సందర్భంగా రాష్ట్రాల మధ్య విభజన ఏర్పడిందని ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. బంద్ నేపథ్యంలో అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందన్నారు. భారత్ బంద్ సమయంలో దుకాణా సముదాయాలు మూసివేయరాదని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసులు బెదిరిస్తున్నారని, నాన్ బీజేపీ రూలింగ్ రాష్ట్రాల్లో దుకాణాలు మూసివేయాలని ప్రోత్సహిస్తున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలాఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రైతులకు కలవకుండా ఉండేందుకు గృహనిర్భంధం చేశారని చెప్పుకొచ్చారు.

మరో ట్వీట్‌లో ఇప్పుడు రాజకీయ చర్చలకు గుండె అయిన ( వ్యవసాయ చట్టాలను) తీసుకురావడానికి ముందు మోడీ ప్రభుత్వం సంప్రదించిన వాటాదారులు ఎవరు..? ఇది వ్యవసాయ చట్టాల గురించి లేదా మోడీ పాలన నమూనా గురించి తెలియజేస్తుందా అని తనదైన శైలిలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News