జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల రిమాండ్

దిశ, వెబ్‌డెస్క్ : జర్నలిస్ట్ రఘు కేసు సుఖాంతం అయింది. తామే అరెస్ట్ చేశామని ప్రకటించిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయనను గురువారం మధ్యాహ్నం హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మండలంలోని గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో జర్నలిస్ట్ రఘు A-19గా ఉన్నట్లు పోలీసులు న్యాయస్థానికి తెలిపారు. ఈ కేసులో రఘుకు హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14రోజులు రిమాండ్ విధించారు. అనంతనం ఆయనను […]

Update: 2021-06-03 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జర్నలిస్ట్ రఘు కేసు సుఖాంతం అయింది. తామే అరెస్ట్ చేశామని ప్రకటించిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయనను గురువారం మధ్యాహ్నం హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మండలంలోని గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో జర్నలిస్ట్ రఘు A-19గా ఉన్నట్లు పోలీసులు న్యాయస్థానికి తెలిపారు. ఈ కేసులో రఘుకు హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14రోజులు రిమాండ్ విధించారు. అనంతనం ఆయనను హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి :

రాజ్ న్యూస్ రిపోర్టర్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఫిబ్రవరి 17న గుర్రంపోడు తండా వద్ద పోలీసులపై జరిగిన దాడి ఘటనలో కేసు cr. No.21/2021 లో జర్నలిస్ట్ రఘు A-19 నిందితుడు. ఈ కేసుపై రఘు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ రఘును ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మఠంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News