జర్నలిస్టు రఘు రిలీజ్.. ఘన స్వాగతం పలికిన మద్దతుదారులు
దిశ, నల్లగొండ: జర్నలిస్టు రఘు నల్లగొండ జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ నెల 3వ తేదీన ఆయన్ను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోని ఓ తొపుడుబండి వద్ద పండ్లు కొనుగోలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంబోడు గిరిజన భూముల కేసు విషయంలో రఘును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రఘు ఓ టీవీ వేధికగా హుజూర్‌నగర్ ఎమ్మెల్యేను దూషించారనే ఆరోపణలతో మఠంపల్లి మండలంలోని కొంతమంది అధికార పార్టీ […]
దిశ, నల్లగొండ: జర్నలిస్టు రఘు నల్లగొండ జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ నెల 3వ తేదీన ఆయన్ను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోని ఓ తొపుడుబండి వద్ద పండ్లు కొనుగోలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంబోడు గిరిజన భూముల కేసు విషయంలో రఘును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రఘు ఓ టీవీ వేధికగా హుజూర్‌నగర్ ఎమ్మెల్యేను దూషించారనే ఆరోపణలతో మఠంపల్లి మండలంలోని కొంతమంది అధికార పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను దూషించినందుకు, గుర్రంబోడుతండా సంఘటనలపై రఘుపై ఐపీసీ 504 సెక్షన్ కింద మఠంపల్లి స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొదటగా రఘును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో, పలు న్యూస్ ఛానల్లో వార్తలు వెలువడ్డాయి.
మల్కాజ్‌గిరిలో రఘను పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జిల్లా జైలుకు రహస్యంగా తరలించారు. దీంతో పన్నెండు రోజుల తర్వాత ఈ నెల 14 వ తేదీన సోమవారం సాయంత్రం మిర్యాలగూడ 8th అదనపు కోర్టు జర్నలిస్టు రఘుకు రూ.30వేల పూచికత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, అప్పటికే కోర్టు సమయం అయిపోవడం, మరుసటి రోజు 15వ తేదీన మంగళవారం సాయంత్రం రఘు విడుదలయ్యారు. పలు పార్టీల నాయకులు జైలు ఎదుట దాదాపుగా గంటకు పైగా ఎదురుచూశారు. అనంతరం జైలు నుంచి బయటకు వస్తున్న రఘుకు పలు పార్టీల జిల్లా నాయకులు పూల దండలతో ఘన స్వాగతం పలికారు. తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తన పోరాటం ఆగబోదని జర్నలిస్టు రఘు వెల్లడించారు.