అవినీతి, అక్రమాలపై పోరాటమే జర్నలిజం

దిశ, వెబ్‌డెస్క్ :అవినీతి, అక్రమాలపై పోరాటమే జర్నలిజం అని, తన కథనాలతో 25 ఏళ్లుగా ఎన్నో అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ.. సమాజ సేవ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు సేవలు స్ఫూర్తిదాయకమని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ స్వర్ణలత చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లుతోపాటు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును […]

Update: 2021-02-09 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ :అవినీతి, అక్రమాలపై పోరాటమే జర్నలిజం అని, తన కథనాలతో 25 ఏళ్లుగా ఎన్నో అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ.. సమాజ సేవ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు సేవలు స్ఫూర్తిదాయకమని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ స్వర్ణలత చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లుతోపాటు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును వారు ఘనంగా సన్మానించారు. బుర్రి వెంకటేశ్వర్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్ర స్థాయిలో గ్రామీణ ఘంటసాలగా పేరొందరని కొనియాడారు. భూపతి రాములు తన కథనాలతో అవినీతి, అక్రమాలను ప్రశ్నించడంతోపాటు నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన వార్తలను అందిస్తూ.. జర్నలిజానికి వన్నే తెచ్చారని కితాబు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మన్సూర్ నాయక్, ఎంఈవో దారాసింగ్, స్ఫూర్తి సొసైటీ చైర్మన్ వేుడి కృష్ణ, ప్రెసిడెంట్ నారగాని శ్రీనివాస్, బెల్లంకొండ నారాయణ, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ బత్తుల వెంకట్రాములు, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ తిప్పర్తి గంగరాజు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News