నోయిడాలోని NIB లో పలు ఉద్యోగాలు
నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ (ఎన్ఐబీ) న్యూఢిల్లీలోని రాజధాని ఎంటర్ ప్రైజెస్ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ (ఎన్ఐబీ) న్యూఢిల్లీలోని రాజధాని ఎంటర్ ప్రైజెస్ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, ఐటీ డివిజన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 59
పోస్టుల వివరాలు:
టెక్నికల్ అసోసియేట్ - 8
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 6
ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 45
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/డిప్లొమా (కంప్యూటర్ సైన్స్)/గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్/హిందీ టైపింగ్ ఉండాలి.
వర్క్ ఎక్స్పీరియన్స్: పోస్టులను అనుసరించి 1 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: rajdhanienterprises2007@gmail.com/rajdhanienterprises338@gmail.com
చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023
వెబ్సైట్: https://www.nib.gov.ఇన్
Also Read..