రాత పరీక్ష లేకుండానే ECIL లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 29
ఖాళీల వివరాలు:
టెక్నికల్ ఆఫీసర్
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఎంపీసీ /డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం ఏడాది.
వేతనం:
టెక్నికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 25,000 ఉంటుంది.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: నెలకు రూ. 24,500 చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: సీఎల్‌డీసీ, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టిఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ - 500062.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 6, 7/2023.
సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://www.ecil.co.in