వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు
దేశ వ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధన కేంద్రాల్లో సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్
దిశ, కెరీర్: దేశ వ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధన కేంద్రాల్లో సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్ (ఎస్ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్‌టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్) - 2023 నిర్వహణకు సంబంధించి న్యూ ఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్‌బీ) ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 195
వివరాలు:
సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (ఎస్ఎంఎస్) - 163
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్‌టీవో) - 32
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఏప్రిల్ 10, 2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్ పరీక్షకు 1.1.2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి.నెట్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.
వేతనం: నెలకు ఎస్ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్ఎంఎస్, ఎస్‌టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్; విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ప్రారంభం: మార్చి 23, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 24 నుంచి 30/2023.
వెబ్‌సైట్: http://www.asrb.org.in