UPSC ESE, జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మార్చి 3, 2023న UPSC ESE ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది.
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మార్చి 3, 2023న UPSC ESE ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది.ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2023 కి హాజరైన అభ్యర్థులు upsc.gov.inలో UPSC అధికారిక సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి 19, 2023 న జరిగింది
జూన్ లో మెయిన్స్ :
అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 25, 2023న జరిగే ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షకు హాజరు కావాలి. అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్‌లను కమీషన్ వెబ్‌సైట్ నుండి 3 వారాల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మార్చి 3, 2023న UPSC జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 ని ప్రకటించింది. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2023 కి హాజరైన అభ్యర్థులు UPSC అధికారిక సైట్ upsc.gov.inద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.