Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 3వేల ఉద్యోగాలపై అప్‌డేట్..
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది.
దిశ వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 3000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 3000 పోస్టుల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రాతిపాదన తీసుకు వచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లను, కండక్టర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.
ఆర్టీసీ ఇదే ప్రాతిపాదనను ఆర్థిక శాఖ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా ఆర్టీసీ ప్రాతిపాదన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదే జరిగితే రెండు వేల డ్రైవర్ పోస్ట్‌లకు, అలానే శ్రామికులు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు సంబంధించిన మరో వెయ్యి పోస్టులకుగాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 3000 ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం.