యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

బీఎస్సీ, బీటెక్, ఎంటెక్ పాసైన యువతకు యూనియన్ బ్యాంక్ శుభవార్త తెలిపింది.

Update: 2024-02-04 15:47 GMT

దిశ, ఫీచర్స్ : బీఎస్సీ, బీటెక్, ఎంటెక్ పాసైన యువతకు యూనియన్ బ్యాంక్ శుభవార్త తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3 నుండి ప్రారంభమై 23 ఫిబ్రవరి 2024 న ముగియనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ యూనియన్‌ బ్యాంక్ ఆఫ్ ఫిండియా.కో.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ లో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. CBT పరీక్ష తేదీ కూడా విడుదల చేసింది.

విద్యార్హత..

చీఫ్ మేనేజర్ ID పోస్ట్ కోసం, అభ్యర్థి కంప్యూటర్ సైన్స్‌లో B.Sc., B.Tech లేదా M.Tech డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థికి సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. ఇతర పోస్ట్‌లకు సంబంధించిన అర్హతకు సంబంధించిన సమాచారం కోసం, మీరు జారీ చేసిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

వయోపరిమితి..

వివిధ పోస్టులకు వేర్వేరుగా వయోపరిమితులు ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు రుసుము..

జనరల్ / EWS / OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850.

SC/ST/PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

bankofindia.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.

స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లింక్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం చేయండి.

దరఖాస్తును ప్రారంభించి, రుసుమును జమ చేయండి.

ఎంపిక ఎలా జరుగుతుంది?

స్పెషలిస్ట్ ఆఫీసర్ వివిధ పోస్టులకు సీబీటీ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. CBT పరీక్షను మార్చి లేదా ఏప్రిల్ 2024లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్

Tags:    

Similar News