యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జూన్ 2023)
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023 (యూజీసీ-నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది.
దిశ, కెరీర్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023 (యూజీసీ-నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఈ పరీక్షను జూన్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఈ పరీక్షకు మే 10 నుంచి మే 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
పోస్టుల వివరాలు:
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జేఆర్ఎఫ్‌కు జూన్ 1, 2023 నాటికి 30 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు లేదు.
అప్లికేషన్ ఫీజు: జనరల్ /అన్ రిజర్వ్‌డ్‌కు రూ. 1150
జనరల్ -ఈడబ్ల్యూఎస్/ఓబీసీ - ఎన్‌సీఎల్ రూ. 600
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ. 325.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: మే 10, 2023
చివరి తేదీ: మే 31, 2023
పరీక్ష తేదీలు: జూన్ 13, 2023 నుంచి జూన్ 22, 2023 వరకు.
వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in/
ఇవి కూడా చదవండి: