స్వామి రామానంద తీర్ధ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్ కోర్సులకు శిక్షణ.. ఆపై ఉద్యోగం

పంచాయతీరాజ్, గ్రామీణాభివ‌ృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణతో పాటు ఉద్యోగ కల్పనకు గానూ నోటిఫికేషన్ విడుదలైంది

Update: 2023-05-24 14:53 GMT

దిశ, కెరీర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివ‌ృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణతో పాటు ఉద్యోగ కల్పనకు గానూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 1, 2023 న ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరై దరఖాస్తు సమర్పించవచ్చు.

శిక్షణా కార్యక్రమం:

1, బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్:

ఈ కోర్సు కాలపరిమితి - 2నెలలు

అర్హత: ఇంటర్మీడియట్ పాస్

కోర్సు ఫీజు - రూ. 1000 చెల్లించాలి.

2. బ్యూటీషియన్ :

కాలపరిమితి - 45 రోజులు

అర్హత: పదో తరగతి పాస్

ఫీజు: రూ. 1500 చెల్లించాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు.

కావలసిన పత్రాలు:

1. అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ ఉండాలి.

2. పాస్ పోర్ట్ సైజు ఫొటోలు

3. ఆధార్ కార్డు

వసతి: హాస్టల్ వసతి కోసం నెలకు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది.

అడ్రస్: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508284.

హాజరుకావాల్సిన తేదీ: జూన్ 1, 2023. ఉదయం 10 గంటలకు కావలసిన పత్రాలతో సంస్థలో హాజరు కావాలి.

ఇతర వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222, 9948466111.

Tags:    

Similar News