అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఖాళీలు
అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం, గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
దిశ, కెరీర్: అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం, గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ - 2023 (గ్రూప్ బి,సి): 616 (ఏపీ - 25, తెలంగాణ - 27 పోస్టులున్నాయి)
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 17, 2023.
చివరి తేదీ: మార్చి 19, 2023.
ర్యాలీ ప్రారంభం: మే 1, 2023.
వెబ్సైట్: https://www.assamrifles.gov.in