SSC GD కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నిరీక్షణ ముగిసింది.
దిశ, ఫీచర్స్ : SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నిరీక్షణ ముగిసింది. SSC GD కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ని ఫిబ్రవరి 20 నుండి 12 మార్చి 2024 వరకు నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ప్రక్రియ..
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి లాగిన్ అవ్వండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా నవీకరణల లింక్ పై క్లిక్ చేయండి.
తర్వాత SSC GD కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ని ఓపెన్ చేయాలి.
తదుపరి పేజీలో అవసరమైన వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
మీరు లాగిన్ అయిన వెంటనే అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
అడ్మిట్ కార్డును తనిఖీ చేసి, దాని ప్రింట్ తీసుకోండి.
అభ్యర్థుల పేర్లతో పాటు అడ్మిట్ కార్డ్‌లో తల్లిదండ్రుల పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ, పరీక్ష సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ వివరాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అడ్మిట్ కార్డును తీసుకోండి.
పరీక్ష వివరాలు..
SSC GD కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి 20 ఫిబ్రవరి 2024 నుండి మార్చి 12, 2024 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. SSC జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనుండగా అందులో సీఐఎస్‌ఎఫ్‌లో 11,025, బీఎస్‌ఎఫ్‌లో 6174, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌లో 3189, సీఆర్‌పీఎఫ్‌లో 3337, సశాస్త్ర సీమా బల్‌లో 635 పోస్టులు ఉన్నాయి.