JIPMERలో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు
జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్డెస్క్: జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 97
విభాగాలు:
1. స్పెషలిస్ట్-9
2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-20
3. చైల్డ్ సైకాలజిస్ట్-2
4. నర్సింగ్ ఆఫీసర్-25
5. ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియో-డయాగ్నోసిస్)-5
6. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్-2
7. జూనియర్ ఫిజియోథెరపిస్ట్-2
8. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్-27
9. ఫార్మసిస్ట్-1
10. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - II-2
11. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-97
అర్హత: విభాగాలను బట్టి MBBS, M.Phil, B.Sc, Therapy, Pharmacy(డిగ్రీ), 12th. అనుభవం.
జీతం: పోస్టులను బట్టి రూ.25 వేల నుంచి రూ.67 వేలకు పైగా ఉంటుంది.
అభ్యర్థుల కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1500+చార్జీలు
SC/ ST అభ్యర్థులకు రూ.1200+చార్జీలు
PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 19, అక్టోబర్ 2023
చివరి తేదీ: 16, నవంబర్ 2023
వెబ్సైట్: https://jipmer.edu.in/