నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: SBIలో ఉద్యోగాల జాతర.. భారీగా పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారీగా జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2023-11-16 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారీగా జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 8,773

పోస్ట్ పేరు: జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు కూడా అర్హులే.


తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య:

తెలంగాణ(హైదరాబాద్ సర్కిల్): 525

ఆంధ్రప్రదేశ్(అమరావతి): 50.


వయస్సు: 20-28 ఏళ్లు.

జీతం: నెలకు రూ.19,900.


ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్(ఆన్‌లైన్) టెస్ట్, స్థానిక భాష ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750.

SC/ ST/ PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.


దరఖాస్తు ప్రారంభ తేదీ: 17/11/2023

చివరి తేదీ: 7/12/2023

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి, 2024

మెయిన్స్ ఎగ్జామ్ తేదీ: ఫిబ్రవరి, 2024.

వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers/current-openings

నోటిఫికేషన్: https://sbi.co.in/documents/77530/36548767/161123-JA+2023-Detailed+Advt.pdf/926d28be-7df8-36f3-7113-344404668498?t=1700129762521


Similar News