గుడ్‌న్యూస్.. మరో 1,610 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడే 88 పీహెచ్‌సీలలో 1,232 పోస్టులు, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 63 పీహెచ్‌సీల్లో 378 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో డాక్టర్, హెల్త్ సూపర్‌వైజర్ తదితర పోస్టులున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టులకు జిల్లాల వారీగా నియామకాలు చేపడతామని ఆయన అన్నారు.