రూ. 2 లక్షల జీతంతో NHAIలో మేనేజర్ ఉద్యోగాలు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 42
పోస్టుల వివరాలు:
జనరల్ మేనేజర్ (లీగల్) - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) - 41
వేతనం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్లకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200 వరకు ఉంటుంది.
జనరల్ మేనేజర్లకు రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900 చెల్లిస్తారు.
వయసు: జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్ట వయసు 56 ఏళ్లు.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు - వర్తించదు.
అర్హత: ఈ పోస్టులకు ఎల్ఎల్‌బీ ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
జనరల్ మేనేజర్ పోస్టులకు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ 14 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ /ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: లేదు.
ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: మే 1, 2023.
వెబ్‌సైట్: https://nhai.gov.in/
Also Read..