రాత పరీక్ష లేకుండా ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉచిత ఉపాధి శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-05-01 11:15 GMT

దిశ, కెరీర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉచిత ఉపాధి శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పించేందుకు దరఖాస్తులు కోరుతోంది.

శిక్షణ కార్యక్రమం: ఆటోమొబైల్ 2,3 వీలర్ సర్వీసింగ్

వ్యవధి: 2 నెలలు

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

కావలసిన పత్రాలు:

అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్.

పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు

ఆధార్ కార్డు

హాస్టల్ వసతి: అభ్యర్థులు హాస్టల్ వసతి కోసం నెలకు రూ. 2 వేలు చెల్లించాలి.

అడ్రస్: స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్ (గ్రా.), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508284.

హాజరు కావలసిన తేదీ: మే 8, 2023 (సోమవారం), ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి.

వివరాలకు ఫోన్: 8019626324, 9133908000, 9133908111, 9133908222.


ఇవి కూడా చదవండి:

ESI -పీజీఐఎంఎస్ఆర్‌లో 98 ఖాళీలు  



Tags:    

Similar News